ఆ నలుగురు విద్యార్థులు దొరికారు..
నిన్న హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు పారిపోయారు. ఈ రోజు యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి వ్యవసాయ బావి వద్ద స్నానం చేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. స్కూల్ లో టార్చర్ పెట్టడం వల్ల ఆ విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయామని పోలీసులకు తెలిపారు.