“ఆ 57వేల చదరపు కిలోమీటర్లు నివాసయోగ్యం కాదు”..కేంద్రం అల్టిమేటం
వయనాడ్ విధ్వంసం తర్వాత కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలలోని 57 వేల చదరపు కిలోమీటర్ల పరిధిని ఎకో సెన్సిటివ్ జోన్‌గా(ఈఎస్‌ఏ) ప్రతిపాదిస్తూ డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వయనాడ్ జిల్లాలోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నూల్‌వుళతో సహా కేరళలో 10 వేల కిలోమీటర్లు దీని పరిధిలోకి రానుంది. ముండక్కై, చూర్లమల,అట్టామల పేర్లు ఈ డ్రాఫ్ట్‌లో లేవు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన 13 గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించిన తాజా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉంటే 60 రోజులలో తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది. కేరళలో 9993.7 చ.కి.మీ, మహారాష్ట్రలో 17,340, కర్ణాటకలో 20,668, తమిళనాడులో 6,914, గుజరాత్‌లో 440 చ.కి.మీ ప్రాంతం ఈ సున్నిత ప్రాంతాల పరిధిలోకి వస్తుంది.

ఇప్పటికే ఈ ప్రకృతి బీభత్సంలో 400 మంది మరణించినట్లు సమాచారం. మరో 600 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రకృతి బీభత్సంలో 400 మంది మరణించినట్లు సమాచారం. మరో 600 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సహయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను, మృతులను కనిపెట్టడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్ ఆధారిత రాడార్లను, జీపీఎస్‌ను ఉపయోగిస్తూ వెతుకులాటను కొనసాగిస్తున్నారు. కొండప్రాంతాలలో రహదారులు లేకపోవడంతో సైన్యం సాయంతో తాత్కాలిక వంతెనను నిర్మించి, యంత్రాలు, ఆహార పదార్థాలు తరలిస్తున్నారు.

