Andhra PradeshHome Page Slider

దేశంలో మరెక్కడా లేని గొప్ప పథకం ఈ ‘వైఎస్సార్ లా నేస్తం’

‘వైఎస్సార్ లా నేస్తం’ వంటి గొప్ప పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 5781 మంది జూనియర్ లాయర్లకు మంచి జరిగిస్తూ, గతేడాది నవంబర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం నాలుగేళ్లలో ప్రతి నెల జూనియర్ లాయర్లకు రూ.5 వేల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.41.52 కోట్లు విడుదల చేశామన్నారు. న్యాయవాదులు ఎవరైనా కూడా ‘లా’ కోర్స్ కంప్లింట్ చేసి మొదటి మూడు సంవత్సరాలు ప్రాక్టిస్ లేని పరిస్థితిలో వారి కాళ్లపై వారు నిలబడేందుకు వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెల రూ.5 వేల చొప్పున, ఏడాదికి రూ.60 వేలు వారి చేతుల్లో డబ్బు ఉంటే..ఈ మూడేళ్లు ప్రతి ఏటా రూ.60 వేల చొప్పున మూడేళ్లలో రూ.1.80 లక్షలకు వారికి తోడుగా ఉంటే వృత్తిలో ఇబ్బందులు లేకుండా మంచి జీవితంలో నెట్టుకురాగలుగుతారన్నారు. 

అంతే కాకుండా అడ్వకేట్లకు మంచి జరగాలనే ఆలోచనతో రూ.100 కోట్లతో అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ట్రస్ట్ నుంచి న్యాయవాదుల అవసరాలకు అంటే మెడిక్లైమ్స్, ఇతర రుణాలు రకరకాల పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. జూనియర్ న్యాయవాది వృత్తిలో ఉన్న ప్రతి లాయర్ కు ప్రభుత్వం నుంచి మంచి జరిగిస్తే..ఇదే మమకారం వీళ్లు పేదల పట్ల చూపిస్తారని.. అన్నగా ప్రభుత్వం తరఫున నుంచి వాళ్ల నుంచి కోరుకుంటున్నానని సీఎం జగన్ తెలిపారు. అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదులకు 2023–24కి గాను మొదటి విడత లా నేస్తం కింద రూ.6.12 కోట్లు జమ చేస్తున్నామన్నారు ఏపీ సీఎం జగన్.