‘ఈసారి నేను పోటీచేయను’..కాంగ్రెస్ సీనియర్ నేత
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇకపై వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని సంచలన కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికలలో తన భార్య నిర్మలా రెడ్డి గానీ, తన అనుచరుడు ఆంజనేయులు కానీ పోటీ చేస్తారన్నారు. గత ఎన్నికలలో బీఆర్‌ఎస్ నేతల కుట్ర వల్లే తాను ఓడిపోయానని, అయినా ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధికి పాటు పడతానని పేర్కొన్నారు. ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడతో చర్చిస్తానని పేర్కొన్నారు.

