ఈ సారి బడ్జెట్‌లో మెరుపులెన్ని…మరకలెన్ని?
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్ సభలో ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.దీంతో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు.సాధారణ దిగువ,మధ్యతరగతి ప్రజలు ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్న మంత్లీ వన్ లాక్ ఇన్ కం జీరో టాక్సేషన్ ని ప్రవేశపెట్టారు.ఏడాదికి రూ.12లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి జీరో టాక్సేషన్ విధిస్తున్నట్లు ప్రకటించడంతో సభ్యులంతా బల్లలు చరిచిఅభినందనలు,సంఘీభావం తెలిపారు.మధ్యతరగతి ఉద్యోగులకు కూడా కేంద్రం తీపి కబురు చెప్పింది.రూ.24లక్షల ఆదాయం దాటితేనే 30శాతం పన్ను విధిస్తామని చెప్పింది.దీనికి ముందు సున్నా శాతం పేదరికమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. వికసిత భారత్‌లో వంద శాతం క్వాలిటీ విద్య.. 2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతం సాధన.. 2025-26కు అంచనా 6.3-6.8 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయమన్నారు.తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు .ప్రపంచవ్యాప్తంగాచర్చనీయాంశాలయ్యాయని పేర్కొన్నారు.కీలకమైన ఆరు రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారంచుట్టామన్నారు.1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చామని వెల్లడించారు. ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక.. పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక.. ప్రయోగాత్మకంగా 10 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య యోజన తీసుకురాబోతున్నామని ఆమె ప్రకటించారు.

👉కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపుతో పాటు.. KCC ద్వారా ఇచ్చే లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామన్నారు. బీహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.ఎగుమతులు చేసే MSMEలకు రూ.20 కోట్ల వరకు రుణాలు పంపిణీ చేస్తామన్నారు. MSMEలకు రుణ సదుపాయాలు పెంచుతామని స్పష్టం చేశారు. MSME రంగంలో 7.5 కోట్ల మంది కార్మికులు ఉండటం శుభపరిణామమన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్ ను మార్చబోతున్నారు..
👉పోస్టల్ శాఖకు కొత్త రూపు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించనున్నారు. నేషనల్ మ్యాన్‌ఫ్యాక్షరింగ్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు.ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇదే తమ పార్టీ ,కూటమి వికాస్ భారత్ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.ప్రధానంగా 10 రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. ఆ పదిలోలో పేదలు, యూత్, అన్నదాతలు, మహిళలకు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వబోతున్నామన్నారు.దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించనున్నారు.
👉గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు.పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం తీసుకురాబోతున్నారు.కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం తీసుకోబోతున్నారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రవేశపెట్టనున్నారు.పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్ మిషన్ రూపకల్పన చేయనున్నారు.అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు అద్దనున్నారు. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు కల్పించనున్నారు.రానున్న పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం తీసుకోబోతున్నారు.
👉విద్యారంగంలో AI ని విస్తృతంగా వినియోగించనున్నారు. ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు కేటాయించనున్నారు. బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కల్పనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.30 వేలతో స్ట్రీట్ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు.బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తీసుకురాబోతున్నారు MSMEలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు .. స్టార్టప్‌లకు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచనున్నారు. అసోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఇక గ్రామీణ ఎకానమీలో లక్షన్నర గ్రామీణ పోస్టాఫీసుల పాత్ర కీలకం కానుందని ఆమె ప్రకటించారు.
👉ఆరు రంగాల్లో మార్పులు తెచ్చే సంస్కరణలకు నాంది పలికారు.. టాక్సేషన్, విద్యుత్, అర్బన్ డెవలప్‌మెంట్, మైనింగ్, ఫైనాన్స్, రెగ్యులేటరీ సంస్కరణలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పించనున్నారు. 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిర్మించబోతున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందించబోతున్నారు.
👉 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు పంపిణీ చేయనున్నారు. బడ్జెట్‌లో అధికంగా బిహార్‌కు కేటాయింపులు కల్పించారు.బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు నిర్ణయించారు.బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. మూలధన వ్యయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నారు..2028 వరకు జల్‌జీవన్ మిషన్ ను పొడిగించనున్నారు. పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నారు. రూ. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇవ్వబోతున్నారు.దీంతో నగరాల రూపు రేఖలు మారనుననాయి.దేశంలోని నగరాలకు గ్రోత్ హబ్స్‌గా మార్చేందుకు నిధులు కేటాయించబోతున్నారు.
👉రూ.25 వేల కోట్లతో మేరీటైమ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేశారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కల్పించనున్నారు.ఈ తరహా సంస్కరణలు అమలు చేస్తే GSDPలో 0.5 శాతం అదనపు రుణాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
👉క్లీన్ ఎనర్జీ దిశగా అణుశక్తి మిషన్ ను ఏర్పాటు చేయనున్నారు. 2047 నాటికి 100 GWల అణు విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. క్లీన్ టెక్ మ్యాన్‌ఫ్యాక్షరింగ్‌కు ఊతం కల్పించేలా నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్‌టెక్ మిషన్ తీసుకురాబోతున్నారు. మరో 120 రూట్లలో ఉడాన్ పథకం విస్తరించనున్నారు. పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం FDIలకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతి ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఇవి కాక ఇంకా
👉జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం ఉండే అవకాశం
👉దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ..
👉ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక
👉రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు
👉ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్
👉వృద్ధికేంద్రాలుగా పట్టణాలఅభివృద్ధికి రూ.లక్షకోట్లు
👉IIT, IISCల్లో పరిశోధనలు చేసే 10 వేల మందికి ఫెలోషిప్స్.. ఆహార భద్రత కోసం జీన్ బ్యాంక్ ఏర్పాటు
👉వచ్చేవారం పార్లమెంట్ ముందకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు.. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగింపు..
👉స్వయం సహాయక గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డులు.. 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై పన్నుల తగ్గింపు
👉BNS స్ఫూర్తితో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..
👉లిటిగేషన్లు తగ్గించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం..
👉మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత పన్ను విధానం..
👉TDSపై మరింత క్లారిటీ
👉సీనియర్ సిటిజన్స్‌కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు..
👉అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగించనున్నామని సీతారామన్ తెలిపారు.