Home Page SliderNational

ఈసారి వన్డే వరల్డ్ కప్‌ టీమ్‌ఇండియా మెంటర్‌గా ధోనీ

గతంలో జరిగిన T20 ప్రపంచకప్‌లో టీమిండియా మెంటర్‌గా మాజీ కెప్టెన్ ధోనీ పనిచేశారు. అయితే ఆయన సేవలను మరోసారి వినియోగించుకోవాలని BCCI భావిస్తోంది. కాగా ఈ ఏడాది మన దేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు కూడా ధోనినే మెంటర్‌గా నియమించాలని BCCI  యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 3 ICC ట్రోఫీలు అందించిన ధోని అనుభవాన్ని ఉపయోగించుకొని వరల్డ్ కప్ సాధించాలని BCCI ప్రణాళిక సిద్దం చేస్తుంది. కాగా దీనికి ధోనీ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.