home page sliderHome Page SliderNewsTelanganatelangana,viral

ఈసారి బోనాల పండుగ స్పెషల్… ‘చేతివృత్తులకు చేయూత ‘

బోనాల పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘చేతివృత్తులకు చేయూత’ అనే ప్రత్యేక ప్రదర్శనను జూన్ 25 నుంచి 29 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్‌లోని హెచ్‌ఎండిఏ గ్రౌండ్ వద్ద ఈ ప్రదర్శన ఏర్పాటవుతోంది. దీనిలో కుమ్మరుల మట్టి పాత్రలు, మేదరి వెదురు వస్తువులు, గౌడన్నల నీరా, పోచంపల్లి, గద్వాల వంటి ప్రఖ్యాత చేనేత ఉత్పత్తులతో పాటు, బెస్తల వండిన చేపల వంటకాలు, తెలంగాణ రుచుల వంటకాలు ప్రదర్శించబడతాయి. ప్రవేశం ఉచితం కాగా, ఈ కార్యక్రమం ద్వారా బీసీ వర్గాల చేతివృత్తుల కుటుంబాలకు ఆర్థికంగా మద్దతు లభించనుంది. సంప్రదాయ కళలను ప్రోత్సహించడంతో పాటు, పండుగ సందర్భంగా సందర్శకులకు వినోదంతో కూడిన ఒక సాంస్కృతిక అనుభూతిని అందించనుంది.