‘ఈ పాపం వారిదే’..రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై కీలక ప్రకటన చేశారు. ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని, ఆ పాపం బీఆర్‌ఎస్ పార్టీదే అని మండిపడ్డారు. ఆ పార్టీలో పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారని, హైదరాబాద్‌లోని ఖరీదైన భూములను కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, చివరికి వైన్ షాపులను కూడా అమ్మేశారు. ఏదీ మిగలలేదు. వాళ్లు చేసిన అప్పులకు నెలకు రూ. 6,500 కోట్లు కేవలం వడ్డీని కడుతున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ఇచ్చిన హామీలు చేయలేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాం అని పేర్కొన్నారు.

