ఈ సీజన్ IPL విన్నర్స్ వాళ్లే: డివిలియర్స్
ప్రస్తుతం IPL-16 సీజన్‌లో మ్యాచ్‌లన్నీ ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. దీంట్లో ప్రతి జట్టు నువ్వా నేనా అన్నట్టు పోటి పడుతున్నాయి. కాగా ఈ IPL-16 విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో IPL-16 విజేతపై RCB జట్టు మాజీ ఆటగాడు డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఈసారి IPLలో RCB తమ ప్రత్యర్థులందరికీ గట్టి పోటి ఇస్తున్నప్పటికీ..ఈ సీజన్‌లో గెలిచేది మాత్రం గుజరాత్ టైటన్స్ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే హార్థిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గుజరాత్ టైటన్స్ ఎంతో బలంగా కన్పిస్తోందన్నారు. కాబట్టి ఆ టీమ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డివిలియర్స్ వెల్లడించారు. అయితే నేను మాత్రం నా సొంత టీమ్ RCBయే గెలవాలని కోరుకుంటున్నానన్నారు. కానీ ఈ సీజన్‌లో గుజరాత్ టీమ్ అన్నింటిలో మంచి బ్యాలెన్స్‌తో ఉంది అని డివిలియర్స్ తెలిపారు.

