రూ.100 కోట్ల క్లబ్‌లో ఈ కొత్త చిత్రం
దీపావళికి వచ్చిన కొత్త చిత్రాలలో సాయిపల్లవి, శివకార్తికేయన్ నటించిన అమరన్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. భారత్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూళ్లు సాధించింది. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయారని హీరో శివకార్తికేయన్ పేర్కొన్నారు. తన తండ్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని, తాను అమరన్ చిత్రంలో తన తండ్రిని చూసుకున్నానని చెప్పారు. ఆయనే తన మొదటి హీరో అని పేర్కొన్నారు. రెండ్రోజుల్లో వస్తానని వెళ్లిన తండ్రి అంబులెన్స్‌లో ఐస్ బాక్స్‌లో రావడంతో తన గుండె బద్దలయ్యిందన్నారు.