Andhra PradeshHome Page Slider

జగన్‌తో ఇదే నా చివరి మీటింగ్ కావొచ్చు

ముఖ్యమంత్రి జగన్‌తో ఇదే తన చివరి మీటింగ్ కావచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. మచలీపట్నంలో జగన్ నిర్వహిస్తున్న మీటింగ్‌లో పాల్గొన్నారు పేర్ని నాని. ఈ సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ కాలేజితో పాటు దానికి రోడ్లను కూడా వేయించాలంటూ జగన్‌ను కోరారు పేర్ని నాని. దీనికి 25 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. దీనికి జగన్ అంగీకరించారు. అంబేద్కర్ భవనం రిపేర్లకు 5 కోట్లు కేటాయిస్తున్నారు. వివాదాస్పద భూముల సమస్యలు పరిష్కరించాల్సిందిగా నాని జగన్‌ను కోరారు. దీనితో కలెక్టర్లను ఈ సభలోనే ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. ఈ సభలో ఆయన మాట్లాడుతుండగా త్వరగా ముగించాలంటూ సైగలు చేసారు ఎమ్మెల్సీ రఘురాం. మీరెంత లాగినా స్పీచ్ ఆపేది లేదంటూ వ్యాఖ్యానించారు నాని. జగన్‌తో సభలలో ఇదే తన చివరి మీటింగ్ అని, తాను రిటైర్ అయిపోతున్నాననీ అందుకే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. దీనితో వైసీపీ వర్గాల్లో ఏదో జరిగిందన్న చర్చలు మొదలయ్యాయి.