Home Page SliderNational

ఈ నిమ్మకాయ ధర రూ.25వేలు!

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ నిమ్మకాయ రూ.25వేల ధర పలికింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా శివగిరిలోని సదాయప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి పూజలో ఉంచిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేశారు. ఇందులో పలువురు భక్తులు పాల్గొనగా.. కందసామిపాలం నుంచి వచ్చిన భక్తుడు రూ.25వేలకు ఆ నిమ్మకాయను దక్కించుకున్నారు.