క్రిస్టియన్‌గా మారితే ఈ చట్టం వర్తించదు..తేల్చి చెప్పిన హైకోర్టు
ఏపీ హైకోర్టు మత మార్పిడి చేసుకునే వ్యక్తుల విషయంలో కీలక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు క్రిస్టియన్లుగా మతం మార్చుకుంటే వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం ద్వారా రక్షణ పొందలేరని తేల్చి చెప్పింది. తనను కులం పేరుతో దూషించారని గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ అనే పాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగులో ఉన్న ఈ కేసును కొట్టివేయాలంటూ నిందితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిర్యాదు దారు పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారని, రాజ్యాగం ప్రకారం క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించగా, న్యాయమూర్తి అంగీకరించారు. పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేసి ఉండకూడదని వ్యాఖ్యానించింది. క్రైస్తవంలో కులవ్యవస్థ లేదని పేర్కొంది.