ఇందువల్లనే మోనాలిసా చిత్రానికి కనుబొమ్మలు ఉండవు…
ప్రపంచంలోనే అత్యంత సుందరమైన పెయింటింగ్ ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు మోనాలిసా చిత్రం. కానీ మోనాలిసా చిత్రంలో ఎవరికీ కనుబొమ్మలు కనపడవు. దానికి కారణం ఏమిటంటే, నిజానికి లియోనార్డో డా విన్సీ దీనిని చిత్రీకరించినప్పుడు కనుబొమ్మలు కూడా వేశారంట. కానీ కాలక్రమేణా ఈ చిత్రాన్ని శుభ్రపరచడం వల్ల క్షీణించి, నేడు అవి కనిపించడం లేదు. ఈ రహస్యాన్ని పాస్కల్ కొట్టే అనే ఇంజనీర్ వెల్లడించారు.
దీనిని లియోనార్డో డా విన్సీ 1503 – 1519 మధ్యలో చిత్రీకరించారు. ఇది ఇప్పుడు పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉన్నది.