‘ఆర్సీబీ వైఫల్యం అందుకే’..కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఆర్సీబీ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం జట్టు ఓటమికి కారణం బ్యాటర్లే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ప్రారంభంలో పిచ్ బాగోలేకపోయినా, బౌలింగ్ బాగుందని, బౌలర్లు చక్కగా రాణించారని పేర్కొన్నారు. కానీ బ్యాటర్లు త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం, భాగస్వామ్య లోపం వంటి కారణాల వల్ల స్కోరును పెంచలేదని నిరాశ చెందినట్లు వ్యాఖ్యానించారు. కేవలం 42 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని, కానీ టిమ్ డేవిడ్ అర్థ సెచరీ ఊరట కలిగించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ జట్లు 11 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు మైదానంలోనే ఆర్సీబీకి ఇది మూడో ఓటమి కావడం అభిమానులను నిరాశ పరిచింది.