‘వెన్నుపోటు దినం అందుకే’..సజ్జల
చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచిందని, అందుకే వైసీపీ పార్టీ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది పాలనలో ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతోందని, ఇలాంటి మోసం చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలనిచ్చి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు హామీలు అమలు చేయడం చాలా కష్టమని డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. అప్పట్లో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. నియోజక వర్గ స్థాయిలో పార్టీ నేతలు ర్యాలీలుగా వెళ్లి, స్థానిక అధికారులకు మెమోరాండం సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.