ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి..
అనారోగ్యంతో ఓ చేతికి సెలైన్.. మరో చేత్తో ప్రజల వినతులు స్వీకరిస్తూ.. ప్రజాదర్బర్ లో పాల్గొన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ఎమ్మెల్యే నిబద్ధత చూసి ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించాలని మూడు రోజుల క్రితమే ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది. అయితే.. ఈ రోజు కార్యక్రమం వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆరోగ్యం బాగోలేకపోయినా ప్రజాదర్బార్‌లో పాల్గొని వారి నుంచి వినతులు స్వీకరించారు. దీంతో పలువురు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు.