ఢిల్లీలో గ్రాప్ 4 ఆంక్షలు పెడితే ఇదే పరిస్థితి
దేశ రాజధాని నగరం ఢిల్లీ విపరీతమైన వాయు కాలుష్యంతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రాప్ 4 ఆంక్షలు అమలు చేస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రైమరీ క్లాసులకు ఆన్‌లైన్ పద్దతిని ప్రకటించారు. పాఠశాలలు మూసివేశారు. ఈ గ్రాప్ 4 ఆంక్షలు అమలు చేస్తే 10, 12 తరగతులు తప్ప మిగిలిన క్లాసులన్నీ ఆన్‌లైన్ పెట్టాలని, పాఠశాలలు బంద్ చేయాలని నిబంధన విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు కూడా ఆన్‌లైన్ పద్దతిలోనే 50 శాతం ఉద్యోగులను పనిచేయమని ఆదేశించవచ్చు. భవనాల కూల్చివేతను కూడా రద్దు చేస్తారు. మరింత కాలుష్యం పెరిగితే కేవలం అత్యవసర వాహనాలు తప్ప, ఇతర వాహనాలన్నీ రద్దు చేస్తారు.