Home Page SliderInternational

కొరియన్ అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఇదే..

ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు కొరియాలో ఉంటారని ప్రసిద్ధి. వారి బ్యూటీ సీక్రెట్ రైస్ వాటర్ అని కనిపెట్టారు. బియ్యం కడిగిన నీటిని వారు తాగుతారట. ఈ నీటిలో అనేక పోషకాలు ఉంటాయి. బి,ఇ విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉంటాయని కనిపెట్టారు. మన గ్రామాలలో ఈ నీటిని పశువులకు తాగడానికి ఇస్తుంటారు. పట్నాలలో అయితే పారేస్తారు. లేదా కొందరు మొక్కలకు పోస్తారు. బియ్యం కడిగిన నీటిని ఒక గిన్నెలో తీసుకుని మరగపెట్టాలి. తర్వాత వడకట్టి తీసుకోవాలి. ఈ నీటిని గోరువెచ్చగా కూడా తాగొచ్చు. ఉదయాన్నే పరగడుపున గానీ, వ్యాయామాలు చేసిన తర్వాత కానీ ఈ నీటిని తీసుకోవచ్చు. లేదా రాత్రి పడుకునే ముందు కూడా తాగొచ్చు. ఈ నీటిని తాగడం వల్ల తక్కువ కాలంలోనే బరువు తగ్గుతారట. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. జుట్టు సమస్యలు తగ్గుతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. అందుకే కొరియన్ల చర్మం అంతగా మెరిసిపోతుందట.