బాత్‌రూంలో గుండెపోట్లకు కారణం ఇదే..
అమెరికాలోని ఎన్‌సీబీఐ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ గుండెపోట్లు బాత్‌రూంలలోనే వస్తున్నాయి. దాదాపు 11 శాతం హార్ట్ ఎటాక్స్ బాత్‌రూంలో వస్తున్నాయని సర్వేలో తెలిపారు. దీనికి కారణం స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రతలలో మార్పులు ఏర్పడతాయి. దీనివల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ పెరుగుతుందట. రక్తనాళాలలో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. అంతేకాదు మలబద్దకం ఉన్నవారు బలంగా మల విసర్జనకు ప్రయత్నించినప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. అప్పుడు కూడా గుండెపోటు వస్తుందని కార్డియాలజిస్టులు చెప్తున్నారు.