Home Page SliderNational

ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే..రైల్వే శాఖ అప్రమత్తం

ఒడిశాలోని మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న భారీ ప్రమాద సంఘటనకు కారణం కనిపెట్టింది రైల్వేశాఖ. దీనిక సిగ్నల్ వ్యవస్థలోని లోపాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనితో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. సరైన సిగ్నల్ చూపించక పోవడం వల్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పక్క ట్రాక్‌లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కింది. దీనితో పట్టాలు తప్పడంతో కొన్ని బోగీలు దిగువ ట్రాక్‌పై ఎగిరి పడ్డాయి. అదే సమయంలో అటుగా ఎదురుగా వస్తున్న యశ్వంతపూర్ ట్రైన్ చివరి నాలుగు బోగీలను అవి ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగిపోయింది. ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా రైళ్ల రాకపోకలకు సంబంధించిన రిలే రూమ్‌లు, సిగ్నల్ వ్యవస్థలో లోపాలుంటే తెలియజేయాలని ఇప్పటికే అన్ని రైల్వే జోన్ల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. సిగ్నల్ వ్యవస్థలో పరికరాలకు డబుల్ లాకింగ్ ఏర్పాట్లు చేయాలని, రిలే రూమ్‌ల తలుపులు తెరవడం,లేదా మూయడం కోసం డేటా లాగింగ్ వంటివి కూడా తనిఖీ చేయాలని సూచించింది.