సలార్ అంటే అర్థం ఇదే..
మొదటి రోజే రూ.175 కోట్లు సాధించి ఇండియా సినిమా రికార్డులు బద్దలు కొట్టింది సలార్ చిత్రం. పాన్ ఇండియా స్టార్‌గా పేరుపొందిన ప్రభాస్ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ సలార్ అంటే అర్థం ఏంటని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను అడిగారు మీడియా. దీనికి ప్రశాంత్ నీల్ సమాధానమిచ్చాడు. ఇది ఒక ఉర్థూ పదమని పేర్కొన్నాడు. సమర్థవంతమైన నాయకుడు అని దీని అర్థం. దేశాన్నేలే రాజుకు కుడి భుజంగా ఉంటూ అత్యంత నమ్మదగిన వ్యక్తినే సలార్ అంటారట. ఈ చిత్రంలో ప్రభాస్‌కు స్నేహితునిగా నటించిన మళయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌కు అండగా ఉంటూ, ప్రజలను రక్షించే పాత్రలో ప్రభాస్ నటించాడు. అందుకే దీనికి సలార్ అని పేరు పెట్టినట్టు సమాచారం. ఈ చిత్రం భారత్‌లోనే తొలిరోజు రూ.90 కోట్లు వసూలు చేసింది. చాలాకాలం తర్వాత ప్రభాస్‌కు సూపర్ హిట్ చిత్రం రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం తప్పకుండా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందంటున్నారు.