అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాట్ టాపిక్ ఇదే! ట్రంప్ గెలవడం భార్యకు ఇష్టం లేదా?
ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలని అధికార, ప్రతిపక్షాలు భావిస్తుంటాయ్. ఎన్నికల్లో గెలవడం కోసం ఎవరు ఏమైనా చేస్తుంటారు. ఇక ప్రత్యర్థులను విమర్శించడానికి ఏ అవకాశాన్ని కూడా వదలుకోరు. అది ఇండియా ఐనా, అమెరికా ఐనా అంతే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత ఎన్నికల్లో రెండోసారి గెలవాల్సిన ట్రంప్, అనూహ్యంగా బైడెన్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మరోసారి గెలిచి రెండోసారి అమెరికా అధ్యక్షుడవ్వాలని ఆయన తహతహలాడుతున్నారు. అందుకోసం ఆయన భారీ స్కెచ్ వేశారు. బైడెన్ పనైపోయిందని, ఆయన మళ్లీ గెలిస్తే అమెరికన్లకు కష్టాలు తప్పవంటూ ఆయన ఇమేజ్‌ను పెద్ద ఎత్తున డామేజ్ చేశారు. దీంతో డెమొక్రట్లు బైడెన్‌కు రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారింది. కమలా హ్యారిస్ భర్త ఇజ్రాయెలీ యూదు కావడంతో ఆమెకు వారి నుంచి మరీ ముఖ్యంగా, అమెరికాలోని ఇజ్రాయెల్ సంతతివారి నుంచి సపోర్ట్ లభించడంతో గేమ్ మారిపోయింది. అమెరికాలో గెలిచేది నువ్వా-నేనా అన్నట్టుగా సీన్ మారిపోవడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలొద్దని రెండు పక్షాలు భావిస్తుండగా, తాజాగా ట్రంప్ భార్య మెలానియా తన భర్త ఎన్నికల్లో ఓడిపోవాలంటున్నారంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది.

డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కోసం రహస్యంగా పనిచేస్తున్నారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ ఆంథోనీ స్కారముచీ సంచలన ప్రకటన చేశారు. మెలానియా ట్రంప్, కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్నారని, ఎందుకంటే ఆమె డోనాల్డ్ ట్రంప్‌ను ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు. మీడియాస్ టచ్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, మెలానియా ట్రంప్ తన కంటే కమలా హారిస్ విజయం పట్ల ఆమె ఉత్సాహంగా ఉన్నారని ప్రచారం మొదలుపెట్టారు. అదే సమయంలో ట్రంప్ ఎన్నికల ర్యాలీల్లో మెలానియా పాల్గొనకపోవడంతో ఈ చర్చకు ప్రాధాన్యత లభిస్తోంది.

నిధుల సమీకరణ సమయంలోనూ, ట్రంప్ హత్యాయత్నం జరిగిన సమయంలో తప్ప ఆమె పెద్దగా కన్పించలేదు. ఆంథోనీ స్కారాముచీ… 2017లో కేవలం 11 రోజుల పాటు వైట్ హౌస్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థకు అధిపతిగా నియమించబడ్డాడు. జూలై 21 నుండి జూలై 31 వరకు పనిచేస్తున్న సమయంలో ఇది జరిగింది. ఐతే, స్కారాముచి నియామకంతో, ఆ మరుసటి రోజే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ రాజీనామా చేశాడు. దీంతో ట్రంప్ స్కారాముచి తొలగించాడు. ఇలాంటి చెత్త వాగుడు స్కారముచీ ఆపాలని, లేకుంటే తాట తీస్తానంటూ ట్రంప్ ప్రచారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

గత ఎన్నికల్లో మెలానియా ట్రంప్ కు సంబంధించి గత చరిత్రను డెమొక్రట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరకు ఆమె న్యూడ్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దాంతో ట్రంప్, హిల్లరీ క్లింటన్ పై గెలవడం చాలా కష్టమైంది. ఈ నేపథ్యంలో ఈసారి మెలానియా ప్రస్తావ అసలు చేయడం లేదని కూడా తెలుస్తోంది. పూర్తిగా ఆమె తన కుమారుడు బారన్ ట్రంప్ కాలేజీ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెట్టినట్టు ఆమె కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1న ఆమె జ్ఞాపకాలతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. చుట్టూ ఉన్న సమాజాన్ని ఆమె ఎలా జయించారన్నదానితోపాటుగా, ఆమె చేసిన వ్యక్తిగత గొప్ప కార్యాలను ప్రస్తుతించారు.

