దేశంలో సముద్రంలో మొదటి గ్లాస్ వంతెన ఇదే..
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ వద్ద నిర్మించిన పారదర్శకమైన ఫైబర్ గ్లాస్ వంతెనను నేడు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దీనితో ఇకపై కన్యాకుమారి వెళ్లే టూరిస్టులు వివేకానంద మెమోరియల్ వద్దకు వెళ్లడానికి మరింత ఆసక్తి కనపరుస్తారు. ఈ వంతెన 133 అడుగుల తిరువళ్లువార్ విగ్రహాన్ని, వివేకానంద మెమోరియల్‌ను కలుపుతోంది. దీనికోసం తమిళనాడు ప్రభుత్వం రూ.37 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రదేశం ఎంతో కాలంగా సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ ప్రదేశంలో సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రాన్ని కాళ్ల కింద నుండి చూస్తూ సముద్రపు గాలి వీస్తూండగా నడవడాన్ని ఆస్వాదించవచ్చు.

