ఈ వేసవిలో ఐకాన్ స్టార్ మెచ్చిన “దసరా” ఇదేనట..!
నేచురల్ స్టార్ నాని,కీర్తి సురేష్ జంటగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంల తెరకెక్కిన చిత్రం “దసరా”. ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లు పైగా భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశారు. అదేంటంటే దసరా టీమ్ మొత్తానికి నా అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారన్నారు. ఈ సినిమాలో నా బ్రదర్ నాని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడన్నారు. హీరోయిన్ కీర్తితో పాటు ఇతర నటీనటుల ప్రదర్శన ఆకట్టుకుందన్నారు. అంతేకాకుండా ఈ సినిమా శ్రీకాంతో ఓదెలకు దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా తీశారన్నారు. ఈ వేసవిలో ఇది నిజమైన దసరా అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

