NIRF ర్యాంకింగ్‌లో వరుసగా ఆరోసారి కూడా ది బెస్ట్ ఇదే..
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్‌లో (NIRF) ర్యాంకింగ్‌లో వరుసగా ఆరోసారి కూడా మొదటి స్థానంలో నిలిచింది ఐఐటీ మద్రాస్. ఈ జాబితాను కేంద్ర విద్యాశాఖలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నేడు విడుదల చేశారు. ఐఐటీ మద్రాస్ అన్ని రంగాలలోనూ ప్రథమస్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.
వీటిలో వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్ వంటి 13 విభాగాలలో విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించారు. విద్యాబోధన, సౌకర్యాలు, విద్యాసంస్థల భవనాలు ఆధారంగా 2016 నుండి ఈ ర్యాంకులు ప్రకటిస్తున్నారు.
ఉన్నత విద్యాసంస్థలలో టాప్ 10లో 8 ఐఐటీలు ఉండగా, ఎయిమ్స్ ఢిల్లీ, జెఎన్‌టీయూలకు కూడా చోటు దక్కింది.
విశ్వవిద్యాలయాలలో ఐఐఎస్‌సీ బెంగళూరు, జెఎన్‌టీయూ, జామియా మిలియా ఇస్లామియాలకు మొదటి మూడు స్థానాలు దక్కాయి.
ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్, ఢిల్లీ, బాంబే వరుసగా మూడు స్థానాలలో నిలవగా, ఐఐటీ హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది.
మేనేజ్‌మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటిస్థానంలో, బెంగళూరు, కోళికోడ్ రెండు, మూడు స్థానాలలో నిలిచాయి.
వైద్యవిద్యలో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి స్థానంలో, చండిగఢ్‌లోని పీజీఐఎంఈఆర్, వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి తర్వాతి స్థానాలలో ఉన్నాయి.