టైఫాయిడ్‌కు కారణమైన బాక్టీరియా ఇదే..
టైఫాయిడ్ జ్వరం ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తూంటుంది. దీనిని ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటారు. ఈ ఫీవర్ రావడానికి ముఖ్యకారణం సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా. ఈ వ్యాధి వస్తే మొదటగా పేగులు ప్రభావితం అవుతాయి. అనంతరం ఇది శరీరం మొత్తం వ్యాపిస్తుంది. దీనికి ముఖ్యకారణం కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం. ఈ వ్యాధికారకాలను ఈగలు ఎక్కువగా వ్యాప్తి చేస్తాయి. ఈగలు నీటిని, ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి సోకిన రోగికి వికారంగా అనిపించడం, జ్వరం రావడం, వాంతులు, పొత్తి కడుపు నొప్పి, విరేచనాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే టైఫాయిడ్‌గా నిర్థారించుకోవచ్చు. దీనికోసం వైద్యులు వైడల్ టెస్ట్ చేస్తారు. ఈ వ్యాధి సంక్రమణకు పట్టే కాలం 10 రోజుల నుండి 15 రోజులు. దీనిని ముందుగా అరికట్టాలంటే టైఫాయిడ్-పారా టైఫాయిడ్ ఏ, బి అనే వ్యాక్సిన్ వేయించుకోవాలి. పరిశరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఈగల వ్యాప్తిని అరికట్టడం, మంచి తాజా ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. టైఫాయిడ్ చికిత్స కోసం సల్వాడ్రగ్స్, క్లోరోమైసిటిన్ అనే మందుల్ని చికిత్సకు ఉపయోగిస్తారు.