ఇది ప్రజాతీర్పు కాదు.. ఈవిఎం తీర్పు
మహారాష్ట్రంలో బీజెపి ,ఆదాని కలిసి కుట్ర పన్ని ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు.ఎన్నికల ఫలితాలు ఇంకా కొనసాగుతుండగానే ఆయన ఈ ప్రకటన చేయడం సంచలనం గా మారింది.మహారాష్ట్రలో అజిత్ పవార్,షిండే పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇలాంటి సమయంలో ఎన్నికల ఫలితాలు ఇలా ఎలా తారుమారౌతాయని ప్రశ్నించారు. వేల,లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి గెలిచారని ఆరోపించారు. ఇది ప్రజా తీర్పు కాదని,ఇది ఈవిఎం తీర్పంటూ ఎద్దేవా చేశారు.
BREAKING NEWS: ఝార్ఖండ్‌లో బీజేపీకి చుక్కెదురు

