తీహార్ జైలులో కేజ్రీవాల్ దిన చర్య ఇదే..!?
అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నంబర్ 2లో ఉన్నారు. మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితికి చెందిన కవితతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే జైలులో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన భోజనం, బాటిల్ తాగునీరు, టాఫీలను సరఫరా చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుతించింది. తీహార్ జైలులో ముఖ్యమంత్రి 14 రోజుల ఉండాల్సి ఉంది. మద్యం పాలసీ స్కామ్‌లో గత నెలలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలవడానికి కూడా కోర్టు అనుమతించింది. ఇంటి నుండి దిండ్లు, మెత్తని బొంతతో సహా బెడ్ పొందేందుకు అవకాశమిచ్చారు.

కేజ్రీవాల్… డయాబెటిక్ కావడంతో… ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, వైద్య పరికరాలు కూడా అందిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ బాస్ తీహార్ జైలు నంబర్ 2లో, మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితికి చెందిన కె కవిత కూడా ఇదే జైలులో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పొడిగించిన కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు. లిక్కర్ కుంభకోణంలో ED ఢిల్లీ ముఖ్యమంత్రిని “కింగ్‌పిన్” గా పేర్కొంది. భగవద్గీత, రామాయణం, జర్నలిస్టు నీర్జా చౌదరి రచించిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే మూడు పుస్తకాలు… ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను కేజ్రీవాల్‌ను కోరారు.

అరవింద్ కేజ్రీవాల్ జైలు దినచర్య
అరవింద్ కేజ్రీవాల్ 14×8 అడుగుల సెల్‌లో బస ఉంటారు. కేజ్రీవాల్, తీహార్ జైలు నంబర్ 2లో ఉన్న ఇతర ఖైదీలు సూర్యోదయంతో రోజును ప్రారంభిస్తారు. ఖైదీలకు అల్పాహారంగా టీ, కొన్ని బ్రెడ్ ముక్కలు అందిస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత కేజ్రీవాల్ కోర్టుకు బయలుదేరుతారు. న్యాయ బృందంతో సమావేశమవుతారు. మధ్యాహ్న భోజనం 10:30 నుండి 11 గంటల మధ్య ఉంటుంది. ఖైదీలను మధ్యాహ్నం 3 గంటల వరకు వారి సెల్‌లలో ఉంచుతారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు ఒక కప్పు టీ, బిస్కెట్లు ఇస్తారు. ఖైదీలకు రాత్రి 7 గంటలకు డిన్నర్ ఇస్తారు. కేజ్రీవాల్ టీవీ చూడొచ్చు. వార్తలు, వినోదం, క్రీడలతో సహా 20 ఛానెల్‌లు అనుమతిస్తారు.