‘ఇది బ్రేక్ మాత్రమే’..ప్రధాని మోదీ
భారత్, పాక్ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల చర్చలు ముగిసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఉగ్ర పాక్‌పై భారత్ ప్రళయ భయంకరమైన దాడులు చేసిందని, దానికి తట్టుకోలేకే వారు కాళ్ల బేరానికి వచ్చారని పేర్కొన్నారు. పాక్ ప్రవర్తనను నిరంతరం పరిశీలిస్తూనే ఉంటామని, ఇది బ్రేక్ మాత్రమేని హెచ్చరించారు. ఎలాంటి తేడాలు వచ్చినా ఉపేక్షించేది లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ మొదయ్యాక జాతినుద్దేశించి తొలిసారిగా మాట్లాడిన నరేంద్రమోదీ దాయాదిపై నిప్పులు కురిపించారు. ఇకపై ఆ దేశంతో చర్చలు జరిగితే పీఓకే, ఉగ్రవాద నిర్మూలనపై మాత్రమేనన్నారు. పహల్గాంలో అమాయక ప్రజలపై దాడి చేసి, అన్యాయంగా కాల్చి చంపినందుకు ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలను కూల్చి వేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నారు.

