Home Page SliderNational

ఇదేం ఘోరం..యూపీలో పసివాడిపై అమానుష చర్య

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దారుణ సంఘటన జరిగింది. మానవత్వం మరిచిపోయి పసిపిల్లవాడిపై అమానవీయచర్యకు పాల్పడింది ఒక స్కూల్ యాజమాన్యం. మూఢనమ్మకాలకు పోయి ఒక 2వ తరగతి బాలుడిని క్షుద్రపూజలకు బలి ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. స్కూల్ డైరక్టర్ తండ్రి బ్లాక్ మ్యాజిక్‌ను నమ్ముతాడని సమాచారం. స్కూల్ హాస్టల్‌లోనే బాలుడిని హత్య చేసినట్లు తెలిసింది. పాఠశాల హాస్టల్ నుండి బాలుడిని బయటకు తీసుకెళుతుండగా కేకలు వేశాడని, దానితో గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు తెలిపారు. విద్యార్థి తండ్రికి తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని ఫోన్ వచ్చిందన్నారు. అతడు వచ్చేసరికి కారులో డైరక్టర్ తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడని సిబ్బంది వెల్లడించారని, ఆ తర్వాత కారులో మృతదేహాన్ని చూసానని పేర్కొన్నారు. పాఠశాల డైరక్టర్‌ను, అతడి తండ్రిని, ముగ్గురు టీచర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఒక 9వ తరగతి విద్యార్థిని బలి ఇవ్వాలని ప్రయత్నించినట్లు తెలిసింది.