‘యూఎస్ ప్రేక్షకుల వల్లే ఇలా ఉన్నా’..డైరక్టర్
‘పుష్ప-2’ డైరక్టర్ సుకుమార్ అమెరికాలో జరిగిన రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్ ప్రేక్షకులకు తాను ఎంతో రుణపడి ఉన్నానని పేర్కొన్నారు. తాను మహేశ్ బాబుతో తీసిన ‘1-నేనొక్కడినే’ అనే చిత్రానికి ఊహించిన ఫలితం రాలేదని, అందుకే ఆ చిత్రం తర్వాత సినిమాలు ఆపేదామనుకున్నానని పేర్కొన్నారు. యూఎస్‌లో కలెక్షన్లు రాకపోయింటే తాను నిజంగానే సినిమాలు మానేసేవాడినన్నారు. వారి వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ హీరోగా తీసిన ‘రంగస్థలం’, అల్లు అర్జున్‌తో తీసిన ‘పుష్ప’ చిత్రాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ దర్శకునిగా మారిపోయారు.

