బాలయ్య కొత్త సినిమా ఇదే..డైరక్టర్ ఏమన్నారంటే..
టాలీవుడ్ హీరో బాలకృష్ణ కొత్త సినిమా పేరు ఖరారయ్యింది. దీనికి ‘డాకూ మహరాజ్’ అని పేరు పెట్టినట్లు డైరక్టర్ బాబీ పేర్కొన్నారు. ఈ పేరుపై డైరక్టర్ స్పందిస్తూ..ఈ పేరు 1890 నుండి 1955 సంవత్సరాల మధ్య హల్‌చల్ చేస్తూ ప్రజలను భయపెట్టిన బందిపోటు పేరని చెప్పారు. ఈ పేరు తమ స్టోరీకి అతికినట్లు సరిపోతుందని ఈ పేరు పెట్టామన్నారు. ‘పోకిరి’లో మహేష్ బాబులాగే మా హీరో కూడా తప్పు చేస్తే తాట తీస్తాడని వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో వచ్చే టీజర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు రకాలుగా కనిపిస్తారని, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం.

