‘ఇది తెలంగాణ మహిళలకు ఘోర అవమానం’ ..సబిత
తెలంగాణ మహిళలు, ఆడబిడ్డలను అవమానపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వీరవనితలతో వరంగల్ దేవాలయం ముందు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం చాలా అన్యాయం అన్నారు. ప్రభుత్వం యావత్ మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ సుందరి పోటీదారులను రాష్ట్ర సందర్శనలో భాగంగా వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలకు తీసుకువెళ్లారు. వీరు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక బస్సుల్లో బుధవారం సాయంత్రం హనుమకొండలో సందడి చేశారు. వేయి స్తంభాల గుడి వద్ద వారికి ఇత్తడి పళ్లెంలో కాళ్లు కడిగించి ఆలయంలోనికి పంపారు. ఈ సంఘటనపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

