Home Page SliderNational

ఇదంతా కాంగ్రెస్ కుట్రే..బ్రిజ్ భూషణ్

వినేశ్ ఫొగట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతోనే తనపై కాంగ్రెస్ కుట్ర తేటతెల్లమయ్యిందని రెజ్లర్ల అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. తనపై రెజ్లర్లు చేసిన ఆరోపణలు ఎంతవరకూ నిజమో ఈ సంఘటనతో తెలుస్తోందన్నారు. దీనంతటికీ కాంగ్రెస్ నేత భూపేందర్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా కారణమని పేర్కొన్నారు. వారే ఈ కుట్రకు సూత్రదారులని, ఈ విషయంపై గతంలోనే తాను చెప్పానన్నారు. ఇప్పుడు దేశానికి కూడా వారి కుట్ర అర్థమయ్యిందన్నారు. గతంలో బ్రిజ్ భూషణ్ డబ్ల్యూ ఎఫ్‌ఐ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మహిళా రెజ్లర్లపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని, అతడిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు భారీ ఎత్తున నినాదాలు, సత్యాగ్రహాలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని ఘటనల తర్వాత అతడిని అధ్యక్షునిగా తొలగిస్తూ ఫెడరేషన్ చర్యలు తీసుకుంది. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధి, ప్రియాంక వంటివారు గట్టి మద్దతునిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వారిని ఆహ్వానించడం, వినేష్ జులానా స్థానం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతోంది. బజరంగ్ పునియా బాద్లీ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు.