“ఇది కుర్చీని కాపాడుకోవడం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్”:రాహుల్ గాంధీ
ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ మాట్లాడుతూ..ఇది కుర్చీని కాపాడుకోవడం కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అని విమర్శించారు. కేవలం తమ మిత్ర పక్షాల కళ్లల్లో ఆనందం కోసం కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలను మోసం చేసిందని రాహుల్ ఆరోపించారు. కాగా ఈ బడ్జెట్‌తో దేశంలోని సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

