75 వేల మంది యువతకు ఉద్యోగాల దీపావళి
మనసర్కార్ , న్యూఢిల్లీ
ఈ దీపావళికి ప్రధాని మోదీ దేశ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయన ఏంచేసినా ఏదో వెరైటీగా ప్లాన్ చేస్తారు. ఈసారి దేశవ్యాప్తంగా 75 వేల ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ విభాగాలలో, వివిధ మంత్రిత్వ శాఖలలో ఇవ్వనున్నారు. వారికి అప్పటికప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేస్తారట. దీపావళికి ముందుగా శనివారం నాడు వీరితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కేంద్ర మంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియా గుజరాత్ నుండి, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్ నుండి.. వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుండి హాజరు కాబోతున్నారు. అలాగే ఎంపీలందరూ వారివారి పార్లమెంట్ నియోజక వర్గాల నుండి హాజరవుతున్నారు. ఈ ఉద్యోగాలు రక్షణ, హోం, రైల్వే, కార్మిక, తపాలా ,సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాలలో ఉంటాయట. ఈ రకంగా ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి.