నాకు 2007 కంటే ఈసారి సాధించిన కప్ ఎంతో స్పెషల్-రోహిత్ శర్మ
తనకు 2007లో మొదటిసారి టీ20 వరల్డ్ కప్ సాధించినదాని కంటే ఇప్పుడు మళ్లీ సాధించిన వరల్డ్ కప్ ఎంతో స్పెషల్ అన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఎందుకంటే అప్పుడు ధోనీ నాయకత్వంలో గెలిచినప్పటి కంటే ఈసారి తన నాయకత్వంలో సాధించిన ఈ కప్ తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు రోహిత్. 2007లో కూడా ఇలా విజయోత్సవం జరిగింది. అప్పుడు కూడా అభిమానులు భారీగా హాజరయ్యారు. ఇప్పుడు కూడా అభిమానులు ముంబై రోడ్లన్నీ సందడి చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని గర్వపడేలా చేశామని భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ముంబయిలో రోడ్‌షోను విజయవంతం చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు విరాట్ కోహ్లి. మీ నిబద్దతకు, సేవలకు అభినందనలు, జైహింద్ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు విరాట్ కోహ్లి.

