రూ.99కే థియేటర్లలో ఈ వివాదాస్పద చిత్రం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించి, స్వయంగా దర్శకత్వం వహించిన రాజకీయ చిత్రం ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీ పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పటికే అనేక వివాదాలను ఎదుర్కొంది. పలుమార్లు వాయిదాలు పడుతూ చివరకి ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం చూసేందుకు తొలి రోజే థియేటర్లలో రూ.99కే టికెట్ ఆఫర్‌ను ప్రకటించింది మూవీ టీమ్. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించింది కంగనా రనౌత్. ఈ చిత్రంలో కంగన నాటి ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ వంటి వారు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.