Home Page SliderNational

‘బెంగళూరులో ఒక రూపాయికే ఆటో’..బంపర్ ఆఫర్ ఇచ్చిన ఈ కామర్స్ సంస్థ

మహానగరం బెంగళూరులో కేవలం ఒక రూపాయికే ఆటో రైడ్ అవకాశాన్ని అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. బిగ్ బిలియన్ డే సేల్‌లో యూపీఐ పేమెంట్ ప్రమోషన్‌లో భాగంగా స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఫిప్‌కార్ట్. దీనికోసం ప్రత్యేకంగా స్టాళ్లు తెరిచింది ఈ సంస్థ. ఈ ఆఫర్ ఇవ్వడం కొరకు లోకల్ ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌పై ఇప్పటికే సోషల్ మీడియా మీమ్స్‌తో, పోస్టులతో నిండిపోయింది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ గేమ్‌ని మార్చేసిందని, ఇకపై ఆటో క్యాన్సిలేషన్ గురించి ఆందోళన చెందనక్కరలేదని వినియోగదారులు అంటున్నారు. తమ నగరాలలో కూడా ఇలాంటి ఆఫర్లు పెట్టాలని ఫ్లిప్‌కార్టును కోరుతున్నారు.