కల్కి కోసం ఏడాది ఆలోచించా..కమల్ హాసన్
తాను కల్కి సినిమాను చేయగలనా లేదా అనే మీమాంసలో ఏడాది కాలం వరకూ ఆ సినిమాను అంగీకరించలేదని సహజ నటుడు కమల్ హాసన్ అన్నారు. తాను అన్నిరకాల పాత్రలు చేయగలనని నమ్మకం ఉందని, కానీ ఈ చిత్రంలో సుప్రీం యాస్కిన్ అనే విలన్ పాత్రను ఎలా చెయ్యాలి అని ఆలోచించానని పేర్కొన్నారు. మరో ముఖ్యపాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ తాను విడుదలకు ముందు రామచరితమానస పుస్తకాన్ని చదువుతున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను చెప్పగానే, ఇతడు ఏం తింటున్నాడు, ఇంత గొప్ప ఆలోచనలు ఎలా వచ్చాయి అని ఆలోచించానన్నారు. ఎన్నో రోజులుగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న విజువల్ వండర్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

