Andhra PradeshHome Page Slider

జనాభా పెరుగుదలకై ఆలోచన చేయండి: బాబు

ఏపీ: జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఒక బిడ్డను కనాలనే కాన్సెప్ట్‌తో యూత్ ఉంటున్నారు. అది దేశ జనాభా తగ్గుదలపై పడే అవకాశం లేకపోలేదు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ముసలివాళ్లు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీనివల్ల సంపాదన కూడా తగ్గుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి అని పిలుపు ఇస్తున్నాను.