గచ్చిబౌలిలో దొంగలు కలకలం
గచ్చిబౌలిలో అర్ధరాత్రి దొంగలు కలకలం రేపారు. కొండాపూర్ వెస్సేల్లా ఉడ్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడిన గ్యాంగ్ పలు విల్లాల్లోకి ప్రవేశించి డోర్లు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఖాళీ చేతులతో వెనుదిరిగారు. ఈ దృశ్యాలు సెక్యూరిటీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. అయితే గేట్స్ దగ్గర సెక్యూరిటీ ఉన్నా లోపలికి దొంగలు ఎలా ప్రవేశించారని విల్లాస్ యజమానులు మండిపడుతున్నారు. ప్రతి నెలా మెయింటనెన్స్ పేరుతో విల్లాస్ అసోసియేషన్ వారు ఒక్కొక్క విల్లా వారి నుంచి రూ.25వేల చొప్పున వసూలు చేస్తున్నారని, కనీసం సెక్యూరిటీ కల్పించకపోవడం దారుణమని ఫైర్ అవుతున్నారు.

