వేములవాడ ఆలయంలోకి దొంగలు
వేములవాడ రాజన్న ఆలయంలో ముగ్గురు మైనర్లు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీల్లో చోరీ చేస్తూ మైనర్లను సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిన్న సాధారణ భక్తుల్లాగా లోపలికి వచ్చిన నిందితులు హుండీలోని నగదు దొంగలించబోయారు. అది గమనించిన ఆలయ సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి రూ.2,800 నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విచారించగా ఆదివారం సైతం వీరు రూ.7 వేలు కాజేసినట్టు వెల్లడైంది. ఆలయ భద్రత సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.