Home Page SliderTelangana

దొంగతనం చేసి, ఛార్జింగ్‌లో సెల్‌ఫోన్ మరిచిపోయిన దొంగ

దొంగతనానికి వచ్చిన ఇంట్లో సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టాడు దొంగ. అయితే దొంగతనం చేసుకుని త్వరగా బయటపడే హడావిడిలో తన సెల్‌ఫోన్‌ను మరిచిపోయి పరుగులంఘించుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. నిన్న హైదరాబాద్ పఠాన్ చెరువులో దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం, డబ్బు దోచుకుని పరారయ్యారు దొంగలు. ఈ దృశ్యాలు రోడ్డులో గల  సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ మొబైల్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.