కమ్మేసిన పొగమంచు..ఐదు వాహనాలు ఢీ
విశాఖపట్నంలో ఉదయం పొగమంచు ఎక్కువగా ఉంది. ముందు వాహనాలు దారి కనిపించనంత దట్టంగా వ్యాపించింది. దీని కారణంగా కొమ్మాది కూడలి వద్ద ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో ముప్పు తప్పింది. ప్రైవేట్ బస్సు, ట్యాంకర్, మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ఈ కూడలిలో వాహనాలు కిలోమీటర్లమేర నిలిచిపోయాయి. పోలీసులకు సమాచారం అందడంతో ట్రాఫిక్‌ను నియంత్రించారు.

