Home Page SliderTelangana

నిద్రలో గురక రాకుండా చేస్తామని ప్రాణం తీశారు..

నిద్రలో గురక రాకుండా చికిత్స చేస్తామని వైద్యులు ప్రాణం తీశారని మృతుడు బంధువులు ఆరోపించారు. ఈ ఘటన సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగింది. కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన వెల్దురి శ్రీనివాస్ నిద్రలో గురక బాగా వస్తోందని డాక్టర్లను సంప్రదించాడు. దీంతో వారు పరీక్షించి ముక్కులో బోన్ పెరిగింది.. ఆపరేషన్ చేస్తే గురక తగ్గుతుందని చెప్పి నిన్న సర్జరీ చేశారు. అయితే నిన్న రాత్రి శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులకు డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా మరణిస్తాడని వారు డాక్టర్లను నిలదీశారు. న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.