Andhra PradeshHome Page Slider

దేవస్థానం అపవిత్రం చేసేందుకు వాళ్లు కంకణం కట్టుకున్నారు..

తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసేందుకు వైసీపీ నాయకులు కంకణం కట్టుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ‘గోశాలలో కొన్నిసార్లు గోశాలలో సహజ మరణాలుంటాయి. వాటిని కూడా పాలకమండలి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా చేశారు.. ఆలయం నిధులను సీసీ రోడ్ల పేరుతో.. దేవస్థానాన్ని అడ్డుగా పెట్టుకొని వందల కోట్లు దోచేశారు’ అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.