భోజనం గురించి కంప్లైంట్లు చేస్తే ఫెయిల్ చేస్తామంటున్నారు..జెఎన్‌టీయూ స్టూడెంట్స్
భోజనం గురించి కంప్లైంట్లు చేస్తే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు స్టూడెంట్స్. నిన్న క్యాంటిన్లో చట్నీలో ఎలుక పరిగెట్టడంతో ఈ విషయం మీడియాలో వైరల్ అయ్యింది. ఎప్పటి నుండో ఇలాంటి భోజనాలే పెడుతున్నారని, పలువురు స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్‌కు లోనయ్యారని ఫిర్యాదు చేశారు విద్యార్థులు. ఈ విషయంపై ఫిర్యాదులు చేస్తే పరీక్షలో ఫెయిల్ చేస్తారని భయపెడుతున్నారు. దీనితో బయటకు పోయి తింటున్నారు. డబ్బు ఖర్చుపెట్టి బయట తినలేకపోతే ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు విద్యార్థులు. భోజనంలో బల్లులు, పురుగులు, ఎలుకలు స్వైరవిహారం చేయడంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫైర్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులను వెంటనే హాస్టల్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జెఎన్‌టీయూ హాస్టల్లో అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లను చూసి మండిపడ్డారు జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి. వెంటనే ఆ ఫుడ్ కాంట్రాక్టర్‌ను తీయించి, కిచెన్లను పూర్తిగా రీమోడల్ చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.