హీరో శ్రీకాంత్ కి ప్రైవేటు పూజలు చేసారని..
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు శ్రీకాంత్‌కు ప్రైవేటుగా పూజలు నిర్వహించారు.

